Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Supreme Court On Bilkis Bano Case: 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

2002నాటి గుజరాత్‌ అల్లర్లలో బిల్కిస్‌ బానోపై అత్యాచారానికి ఒడిగట్టిన 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ, గుజరాత్‌ ప్రభుత్వం గత ఏడాది తీసుకున్న నిర్ణయం చెల్లదని ధర్మాసనం తేల్చిచెప్పింది. రేపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని పేర్కొంది. రేపిస్టుల విడుదలను సవాల్‌ చేస్తూ, బిల్కిస్‌ బానో దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని సుప్రీం తెలిపింది. దీంతో 11 మంది రేపిస్టులు మళ్లీ జైల్లో లొంగిపోవడం ఖాయమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *