Mumbai Indians: ముంబై ఇండియన్స్‌ ఫాన్స్‌కు షాకింగ్ న్యూస్

Mumbai Indians: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యాన్స్‌కు చేదువార్త. టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) మరి కొన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న ఈ డాషింగ్‌ బ్యాటర్‌ తాజాగా స్పోర్ట్స్‌ హెర్నియాతో బాధపడుతున్నట్లు సమాచారం. చికిత్స కోసం సూర్యకుమార్‌ జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. రానున్న రెండు- మూడు రోజుల్లో అతడు సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్‌కు వెళ్లనున్నాడు. దీంతో రంజీల్లో ముంబై తరఫున ఆడటం కుదరదు. అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచకప్ నేపథ్యంలో సూర్య పూర్తిగా కోలుకునేలా మేనేజ్‌మెంట్‌ అన్ని రకాల చర్యలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *