Arvind Kejriwal: సారీ నేను రాలేను.. నాకు పనుంది : కేజ్రీవాల్

ED Summons To Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ సీఎం (Delhi Chief Minister) అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) విచారణకు మరో సారి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate)కు బుధవారం సమాచారం ఇచ్చారు. బుధవారం ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. తాను రావడం లేదని ఈడీకి ముఖ్యమంత్రి సమాచారం ఇచ్చారు. సమన్లపై ఆప్ మండిపడింది. చట్టవిరుద్ధంగా ఈడీ సమన్లు జారీ చేసిందని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే కేంద్రం ఏకైక లక్ష్యమని ఆప్ (Aam Aadmi Party) ఆరోపించింది.

దీనిపై ఆప్‌ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి కేజ్రీవాల్‌ సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ నోటీసులు ఎందుకు పంపారని..? ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అవినీతి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. బీజేపీతో చేతులు కలిపిన వారిపై దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సహకరించడం అంటే నాయకులను అరెస్టు చేయడం కాదని వ్యాఖ్యానించింది. మరోవైపు ఢిల్లీలోని రూస్ అవెన్యూలోని ఆప్ కార్యాలయం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *