Sania Mirza: సానియా మీర్జాకు షాక్, నటిని పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్

Shoaib Malik

Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్, సానియా మీర్జా (Sania Mirza) భర్త షోయబ్ మాలిక్ (Shoaib Malik) మరో పెళ్లి చేసుకున్నారు. సానియాతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అతడు పాక్ నటి సనా జావేద్ (Sana Javed)తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేశారు. కాగా షోయబ్ 2010లో సానియాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక బాబు సంతానం. అంతకు ముందు 2002లో అయేషా సిద్ధిఖీని వివాహమాడిన అతడు 2010లో విడిపోయి సానియాను పెళ్లాడారు.

షోయబ్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సనా జావేద్
పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను ఆ దేశ క్రికెటర్, సానియా మీర్జా భర్త షోయబ్ మలిక్ పెళ్లి చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేసింది. షోయబ్ పెళ్లి ఫొటోలను షేర్ చేసి తన భార్యను పరిచయం చేయగా.. సనా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అంకౌట్లో పేరులో మార్పులు చేసుకున్నారు. షోయబ్ మలిక్‌తొ పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ సనా షోయబ్ మలిక్‌గా పేరు మార్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *