Prathipati Pulla Rao: కోడికత్తి కేసులో జగన్ ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు?

Prathipati Pulla Rao: కోడికత్తి కేసు (Kodi Kathi Case)లో సీఎం జగన్‌ (YS Jagan Mohan Reddy) ఎందుకు కోర్టుకు హాజరు కావడం లేదో ప్రజలకైనా సమాధానం చెప్పాలని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) డిమాండ్‌ చేశారు. చిలకలూరిపేటలోని నివాసంలో శుక్రవారం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. అన్నీ చూస్తుంటే.. అయిదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్న ఒక నిరుపేద, దళిత యువకుడు శ్రీను కేసులో జగన్‌ తీరుపైనే అందరిలో అనుమానాలు కలుగుతున్నాయని, కనీసం అతడికి బెయిల్‌ కూడా అడ్డుపడుతూ జగన్ వాటిని నిజం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు ప్రత్తిపాటి. ఒకవైపు అంతులేని దాడులు, అత్యాచారాలు, మరోవైపు వారి హక్కులపై ఉక్కుపాదంతో జగన్ దళితుల ఉసురు తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు విశాఖ విమానశ్రయంలో జరిగిన ఘటనలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, జగన్‌పై అభిమానంతోనే శ్రీను ఆ పని చేసినట్లు స్వయాన జాతీయ దర్యాప్తు సంస్థనే తేల్చినా… మరింత లోతైన విచారణ కోరుతూ జగన్‌ కేసుని సాగలాగుతుండడం ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాదా అని ప్రశ్నించారు ప్రత్తిపాటి. నాడు ఎన్నికలకు ముందు సొంతబాబాయి వైఎస్ వివేకా హత్య కేసులానే, కోడికత్తి ఘటనను రాజాకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై లేనిపోని అభాండాలు వేశారు. ఈ రెండు కేసుల్లో జాతీయస్థాయి దర్యాప్తు సంస్థలు అయిన సీబీఐ, ఎన్‌ఐఏలే వాస్తవాల్ని వెల్లడించాయని అన్నారు. ఇప్పుడు కోర్టుకు వెళితే తన భండారం పూర్తిగా బయట పడతుందనే జగన్ దొంగనాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కోడికత్తి శ్రీను బయటకు రావడం, జగన్ నిజస్వరూపం ప్రజలందరికీ తెలియడం త్వరలోనే ఖాయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *