Petrol Crisis: పెట్రోల్ బంకుల ముందు కొనసాగుతున్న భారీ క్యూలు

Petrol Crisis In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో చాలా వరుకు ప్రెటోల్‌ బంక్‌ (Petrol Pumps)ల వద్ద రెండో రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆయిల్ ట్యాంకర్ల (Oil Tankers) యజమానుల సమ్మెతో మంగళవారం వాహనదారులు బంకుల వద్దకు పరుగులు పెట్టారు. దీంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్‌, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో యథావిధిగా బంకుల వద్ద పెట్రోల్ సరఫరా కొనసాగుతుంది. అయినా చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్‌ పలు పెట్రోల్‌ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీరారు.

పెట్రోల్‌, డీజిల్‌ దొరుకుతుందో లేదోనని ముందు జాగ్రత్త చర్యగా బుధవారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు చేరుకున్నారు. కిలోమీటర్ల మేర లైన్లలో ఉంటూ ఇంధనం నింపుకుంటున్నారు. పలుచోట్ల ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్‌ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్‌ బంకుల ముందు వాహనదారులు క్యాన్‌లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్‌ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌ నగరంలో చాలా వరకు పెట్రోల్‌ బంకులు మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్‌ బోర్డులు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *