Sankranthi Holidays: ఎంజాయ్, పండగో.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranti Holidays)కు సందర్భంగా ఆరు రోజులు పాటు అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక, జనవరి 13న రెండో శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *