Jail Prisoner: సినిమా స్టైల్లో స్కెచ్, కడుపులో మేకులు, టేపు, బ్లేడ్లు

Jail Prisoner

Chanchalguda Central Jail Prisoner:  జైలు నుంచి తప్పించుకోవాడికి ఓ ఖైదీ చేసిన పని తెలిస్తే అవాక్కవాల్సిందే. డైలీ కడుపు నొప్పితో బాధపడుతున్నాడని ఖైదీని ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు, జైలు అధికారులకు దిమ్మ తిరిగి విషయాలు తెలిశాయి. సదురు ఖైదీ కడుపులో ఏకంగా ఎనిమిది రకాల లోహాలు ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. వివరాలు.. చంచల్‌గూడ జైలులో 21 ఏండ్ల మహమ్మద్‌ సొహైల్‌ ఖైదీగా ఉన్నాడు. ఆయన కొద్ది కాలంగా కడుపునొప్పితో బాధడుతున్నాడు. దీంతో డాక్టర్లు ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

జనరల్‌ సర్జరీ విభాగం యూనిట్‌-7 ప్రొఫెసర్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌ రోగిని పర్యవేక్షించి మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి రిఫర్‌ చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ రమేశ్‌ కుమార్‌ రోగికి ఎక్స్‌రే తీయించగా అందులో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఖైడీ కడుపులో మేకులు, ప్లాస్టిక్‌ వస్తువులు, మెటల్‌ ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంట పాటు శ్రమించి ఎండోస్కోపి సహాయంతో కడుపులో ఉన్న 8 రకాల మెటల్స్‌ను తొలగించి అతని ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఆరోగ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఖైదీ కడుపులో ఉన్న టేపులు, మెటల్ నెయిల్స్‌ను విజయవంతంగా తొలగించిన వైద్యుల బృందాన్ని ఉస్మానియా హాస్పిటల్ సూపరిడెంట్ నాగేంద్ర అభినందించారు. జైలులో నాలుగు గోడల మధ్య ఉండలేక ఎలాగైన బయటపడాలని సోహైల్ వాటిని మింగినట్లు తెలుస్తోంది. అయితే, అది కాస్త అతని ప్రాణం మీదకు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *